చాణక్య నీతి : ఒక వ్యక్తి తన పాదంతో తాకకూడని వస్తువులివే.. తాకితే నాశనమే!

Samatha

10 july  2025

Credit: Instagram

ఆ చార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన గొప్ప పండితుడు. తన అనుభవాల ద్వారా ఎన్నో విషయాలను తెలియజేశారు.

ఇక చాణక్యుడు ఎన్నో విషయాల గురించి తెలియజేసిన విషయం తెలిసిందే. అలాగే ఆయన కొన్ని వస్తువులను తాకడం అస్సలే మంచిది కాదని తెలిపారు.

ఈ వస్తువులను మీరు మీ పాదాలతో తాకినప్పుడు, మీరు పాపం చేస్తారు. ఇది మీ జీవితంలో సమస్యలకు, దు:ఖానికి కారణం అవుతుందని చెప్పుకొచ్చారు.

ఆచార్య చాణక్యుడి ప్రకారం, మీరు పొరపాటున కూడా మీకంటే పెద్ద వారైన వారు లేదా వృద్ధుడు, మీ గురువు లేదా బ్రాహ్మణుడి పాదాలను తాకకూడదంట.

అలాగే, చాణక్య నీతి ప్రకారం,  ఎవరైనా సరే పొరపాటున కూడా కన్యలైన అమ్మాయిల లేదా చిన్న పిల్లల పాదాలను తాకకూడదంట.

కొందరు తెలిసి తెలియ నిప్పుపై కాలు వేయడం లేదా నిప్పుని కొన్ని సార్లు కాలితో చల్లార్చడం చేస్తారు. కానీ ఎట్టిపరిస్థితుల్లో నిప్పుపై కాలు పెట్టకూడదంట.

అదే విధంగా, ఆవు అమ్మతో సమానం అంటారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఆవుకు మీ కాలి పాదం తాకనివ్వకూడదంట

అలాగే కొందరి తన తల్లిని కాలితో తన్నుతుంటారు. కానీ ఎవ్వరైనా సరే తన తల్లికి మీ పాదాలు తాకకుండా చూసుకోవాలంటున్నాడు చాణక్యుడు.