చాణక్య నీతి : భర్త ఏ మూడ్‌లో ఉన్నా భార్యకు ఈ రహస్యాలు చెప్పకూడదంట!
samatha
29 JUN 2025
Credit: Instagram
ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన గొప్ప పండితుడు, తత్వవేత్త అనేక విషయాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి.
ఇక చాణక్యుడు చాణక్య నీతి అనే పుస్తకం ద్వారా నేటి తరం వారికి ఎన్నో విధి విధానాలను తెలియజేయడం జరిగింది. వావి వీరికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
ఇక భార్య భర్తల బంధం గురించి చాణక్యుడు చాలా గొప్పగా తెలియజేశారు. అదే విధంగా బంధం బలంగా ఉండాలంటే కొన్ని విషయాల్లో జాగ్రత్త కూడా అవసరమే అని ఆయన తెలిపారు.
భార్య భర్తలు ఒకరికి ఒకరు ఏ విషయాన్ని దాచుకోకుండా ప్రతి విషయాన్ని పంచుకుంటారు. కానీ భర్తలు భార్యలకు కొన్ని విషయాలను అస్సలే చెప్పకూడదంట.
మరీ ముఖ్యంగా వారు ఎంత ఆనందంగా ఉన్నా లేదా కష్టంలో ఉన్నా, ఎలాంటి మూడ్‌లో ఉన్నా సరే కొన్ని విషయాలను తప్పనిసరిగా భార్య దగ్గర దాచాలంట. అవి :
భర్త, తన బలహీనతను భార్యకు ఎప్పుడూ చెప్పకూడదంట, ఇది ఆమె మీకు వ్యతిరేకంగా ఉపయోగించుకుంటుందంట. కొన్ని సార్లు మీ మాటను వ్యతిరేకిస్తుంది.
అలాగే, మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా అవమానానికి గురి అవుతే ఆ విషయాన్ని కూడా ఎప్పుడూ మీ భార్యకు చెప్పకండి, దీని వలన ఆమె మీకు ఆ సంఘటను గుర్తు చేసి బాధపెడుతుంది.
అదే విధంగా, భర్తలు ఎప్పుడూ కూడా భార్యకు తన పూర్తి సంపాదన గురించి వెళ్లడించకూడదంట. దీని వలన ఆమె ఖర్చులను నియంత్రించుకుంటుంది.