చాణక్య నీతి : తండ్రి తెలియక చేసే ఈ తప్పులే కొడుకు జీవితాన్ని నాశనం చేస్తాయి!
samatha
16 march 2025
Credit: Instagram
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా అనేక విషయాలను తెలియజేశాడు. ముఖ్యంగా మానవ వాళికి ఉపయోగపడే అనేక అంశాల గురించి ఆయన వివరించారు.
ఆచార్య చాణక్యుడు తన కాలంలో గొప్ప పండితుడు, నైపుణ్యం కలిగిన వ్యూహకర్త, ఆర్థికవేత్త. చాణక్య నీతి బోధనలు ఇప్పటికీ ప్రజలకు సరైన మార్గాన్ని చూపించడంలో సహాయపడతాయి.
చాణక్య నీతిలో తండ్రి కోసం కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. తండ్రి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చేస్తాయని తెలిపారు.
తండ్రి కొడుకుల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తండ్రి ఎలా ఉంటే కొడుకు కూడా అదే దారిలో వెళ్తాడు అంటారు పెద్ద వారు.
ఒక తండ్రి తన కొడుకును ఇతరుల ముందు ఎక్కువగా ప్రశంసించకూడదంట. ఇలా చేయడం మంచిది కాదు అని, మీరు మీకొడుకును పొగడటం వలన మీరు మీ కొడుకు ఇబ్బందుల్లో పడతారని తెలిపారు.
ఒక తండ్రి తన కొడుకును ఎక్కువగా ప్రశంసిస్తే అది తన కొడుకుపై తీవ్రప్రభావం చూపుతుంది. అలాగే దానిని ప్రజలు అస్సలే నమ్మలేకపోవడమే కాకుండా, ఎగతాళి కూడా చేసే అవకాశం ఉంటుందంట.
మీ కొడుకు జీవితంలో ముందుకు సాగి విజయవంతం కావాలని మీరు కోరుకుంటే, వారిని ముందుకు సాగమని ప్రోత్సహించాలి తప్ప వారి పొగడటం మానేయాలంట.
వారు ఏదిగే విధానం చూసి అభినందించాలంట. దాని వలన వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కష్టసమయాల్లో ధైర్యం చెప్పి సపోర్టు ఇవ్వాలి అంతే తప్ప పొగడటం మానేయాలంట.