చాణక్య నీతి : వీరి వద్ద ఎంత డబ్బు ఉన్నా ఎప్పటికీ పేదవారే!
Samatha
31 August 2025
Credit: Instagram
ఆచార్య చాణక్యుడు త్వవేత్త. అనేక అంశాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి , రాజీకీయ గురువు, గొప్ప పండితుడు. ఈయన ఎన్నో విషయాల గురించి తెలియజేయడం జరిగింది.
చాణక్యుడు తన జీవితంలోని ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించి, వాటిని నీతి శాస్త్రం అనే పుస్తకంలో ప్రచురించడం జరిగింది. అవి ఈ తరం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి.
చాణక్యుడి విధానాలు ఇప్పటి మానవులకు కూడా సరైన మార్గాన్ని చూపుతున్నాయి. ఎందుకంటే? ఆయన ఎన్నో సమస్యలకు పరిష్కారం తెలిపారు.
సంపద, ఆనందం, జీవితం, ఓటమి, సక్సెస్, బంధాలు , బంధుత్వాలు, ఆలోచనలు, విధానాలు, ఇలా ఎన్నో విషయాల గురించి తెలియజేయడం జరిగింది.
అదే విధంగా ఆయన ఎంత డబ్బు ఉన్నప్పటికీ , ఒక వ్యక్తి ఈ విషయాల్లో ఎప్పటికీ పేదవాడే అని తెలిపాడు. కాగా, దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.
చాణక్యుడు, పేదరికం అంటే డబ్బు కాదు, డబ్బు ఉన్నా అతని కోరికలు తీరకపోవడం, జీవితంలో సంతృప్తి అనేది లేని వాడు నిజమైన పేదవాడు.
నిజమైన సంపద అనేది తృప్తిలోనే దాగుంటుంది. దురాశ అనేది ఒక వ్యక్తిని తన మనసులో నుంచి పేదవారిని చేస్తుందని ఆయన తెలిపారు.
అలాగే ఎక్కువ డబ్బు సంపాదించాలని తప్పుడు మార్గంలో వెళ్లడం, దూరశ, నిస్పృహ వంటివన్నీ పేదరికమే అంటున్నాడు చాణక్యుడు.