చాణక్య నీతి : ఈ   7 వ్యసనాలు మీలో ఉంటే జీవితంలో సక్సెస్ అవ్వలేరు!

samatha 

16 February 2025

Credit: Instagram

ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు  ఈయన గొప్పతత్వవేత్త. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో అనేక విషయాల గురించి తెలియజేయడం జరిగింది.

మరీ ముఖ్యంగా మానవవాళికి సంబంధించిన అనేక విషయాలను ఆయన తన నీతిశాస్త్రంలో పొందు పరిచారు. అయితే ఏ వ్యక్తికైతే ఈ ఏడు వ్యసనాలు ఉంటాయో అతను జీవితంలో సక్సెస్ కాలేడంట.

కొంత మంది తమకు తెలియకుండా విచ్చలవిడిగా డబ్బు ఖర్చుచేస్తుంటారు. అలాంటి వ్యక్తులు జీవితంలో సక్సెస్ అవ్వడం కష్టమే అంటున్నాడు ఆచార్య చాణక్యుడు.

కొందరు ఎదుటి వారిని కించపరిచేలా, వారి మనసు బాధపడేలా కఠినంగా మాట్లాడుతారు. అయితే అలాంటి వారు కూడా లైఫ్‌లో సక్సెస్ అవ్వరంట.

అదే విధంగా ఏ వ్యక్తి అయితే పర స్త్రీ వ్యామోహంలో పడతారో అలాంటి వ్యక్తి   ఎట్టిపరిస్థితులో తమ జీవితంలో విజయం సాధించలేరంటున్నారు చాణక్యుడు.

జూదం ఆడి ఎంతో మంది రాజులు తమ రాజ్యాలనే కోల్పోయారంటూ అనేక కథలలో వింటుంటాం. అయితే పేకాట ఆడే వ్యక్తి కూడా తమ జీవితంలో సక్సెస్ అవ్వలేడంట.

ఏ తప్పు చేయకున్నా కొందరు వట్టి వట్టిగానే ఇతరులను శిక్షిస్తుంటారు. అయితే అలాంటి వారు కూడా తమ లైఫ్‌లో సక్సెస్‌ను చేరుకోలేరంట.

వేటాడే వ్యక్తి కూడా తమ జీవి తంలో సక్సెస్ కాలేడని,  అందువలన ఈ అలవాట్లు ఉన్న వ్యక్తులు వాటికి దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నాడు ఆచార్య చాణక్యుడు.