చాణక్యనీతి : ప్రతి వ్యక్తి కుక్క నుంచి ఈ నాలుగు విషయాలు తెలుసుకోవాలంట!
samatha
21 February 2025
Credit: Instagram
ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన గొప్ప ఆర్థిక వేత్తనే కాకుండా , నైపుణ్యం కలిగిన రాజకీయవేత్త , వ్యూహకర్త కూడా.
చాణక్యడు తన నీతి పుస్తకంలో, ఆయన రాజకీయాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విధానాలను వివరంగా తెలియజేశారు.
అయితే ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రకృతి, మొక్కలు, జంతువుల నుండి చాలా నేర్చుకోగలడని, అది క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడటానికి సహాయపడుతుందని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు.
చాణక్య నీతిలో ఒక వ్యక్తి కుక్క నుండి కూడా చాలా నేర్చుకోగలడని ఆయన తెలిపారు. కాగా, వ్యక్తి కుక్క నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఏవో ఇప్పుడు చూద్దాం..
కుక్క నిద్రపోతున్నప్పుడు చిన్న శబ్ధం వచ్చినా సరే త్వరగా అప్రమత్తం అవుతుంది. అయితే అలాగే వ్యక్తి కూడా నిద్రపోయే సమయంపలో అప్రమత్తంగా ఉండాలంట. దీని వలన ఎలాంటి సమస్యలు రావు.
కుక్కకు సంతృప్తికరమైన స్వభావం ఉంటుంది. దానికి దొరికినదాంట్లోనే అది సంతృప్తి చెందుతుంది. అలాగే వ్యక్తి కూడా ఉన్న సౌకర్యాలతోనే సంతోషంగా ఉండాలి విలాసాలు, సుఖాలు చూసి అసూయపడకూడదంట.
కుక్క ఎంత విశ్వాసంగా ఉంటుందో ప్రతి ఒక్కరికీ తెలుసు. అందువలన చాణక్యడుకూడా వ్యక్తి తాను పని చేసే ప్రతిరంగంలోనూ అంతే నమ్మకంగా ఉండాలని చెబుతున్నాడు.
కుక్కకు ధైర్యం చాలా ఎక్కువ. తన యజమాని కోసం ఎవరితోనైనా పోరాడటానికి రెడీగా ఉంటుంది. అలాగే ప్రతి వ్యక్తి కూడా ఎప్పుడూ ధైర్యంగాఉండాలంట.