వర్షకాలంలో ఈ పండ్లు తినేటప్పుడు జాగ్రత్త తప్పనిసరి !

samatha 

27 JUN  2025

Credit: Instagram

వర్షకాలంలో పూర్తిగా పండిన పమామిడి పండ్లను మాత్రమే తినాలంట. ఎందుకంటే? ఇది సరిగా నిల్వ చేయకపోతే అందులో ఉండే ఆమ్లత్వం కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తాయంట.

వర్షకాలంలో మామిడిపండ్లు తినే సమయంలో ఒకటికి రెండు సార్లు మామిడి పండ్లను చూడాలంటే అందులో పురుగుల లాంటివి ఉండే ఛాన్స్ ఉందంట. అందుకే వీటిని తినే క్రమంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంట.

అదే విధంగా, నేరేడు పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా వర్షకాలం ప్రారంభంలో ఇవి ఎక్కువగా దొరుకుతాయి.

అయితే వీటిని తినే ముందు తప్పకుండా ఈ నేరేడు పండ్లను బాగా కడగాలం. ఎందుకంటే వాటిని కడగకుండా అమ్మడం వలన వాటికి చాలా బ్యాక్టీరియా ఉంటదంట. అందుకే నీళ్లలో నాన బెట్టి తినాంలంట.

వర్షకాలంలో వీలైనంత వరకు అప్పుడే కోసినవి తినడం ఉత్తమం. లేకపోతే తొక్కను సరిగా తీసి తినాలంట. లేకపోతే తొక్కపై హానికర బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుందంట.

ఈ సీజన్‌లో బొప్పాయి తినేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించడి. ముఖ్యంగా గట్టిగా సమాన రంగులో ఉండే బొప్పాయిలను ఎంచుకోవడం ఉత్తమం.

వీలైతే ఏ పండ్లైనా సరే ఉప్పు నీటిలో రెండు లేదా మూడు నిమిషాలు నానబెట్టి తీసుకోవడం వలన అవి క్రిములు, పురుగుల మందులను తొలిగిస్తాయంట.

దానిమ్మ గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తహీనతతో బాధపడే వారు వీటిని తినడం చాలా మంచిది. అయితే వీటిని తినేముందు కాయ నల్లమచ్చలతో ఉంటే కొనుగోలు చేయకూడదంట.