మన శరీరంలో మూత్రపిండాలు రక్తాన్ని శుభ్రపరిచి, మన శరీరం నుండి మురికి, అదనపు నీటిని మూత్రం ద్వారా తొలగిస్తుంది.
శరీరంలోని ఖనిజాలు, నీటి సరైన సమతుల్యతను కాపాడుతుంది. మూత్రపిండాలు క్షీణించడం ప్రారంభిస్తే, దాని ప్రభావం శరీరంలోని అనేక భాగాలపై కనిపిస్తుంది.
మొదట కళ్ళలో చిన్న మార్పులు.. మూత్రపిండాల వైఫల్యానికి ముందు మనకు సూచిస్తాయి. ఈ సంకేతాలను సకాలంలో గుర్తిస్తే, మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్రమైన పరిస్థితులను నివారించవచ్చు.
మనకు లోకాన్ని చూపించే కళ్ళు శరీరంలో చాలా సున్నితమైనవి. ఇక్కడ కనిపించే మార్పులు శరీరం లోపల జరుగుతున్న సమస్యను సూచిస్తాయి.
మీ కళ్ళ కింద వాపు ఉండి, అది రోజంతా కొనసాగితే, కేవలం నిద్ర లేకపోవడం లేదా అలసట వల్ల కాదని గుర్తించాలి.
మీ దృష్టి అకస్మాత్తుగా అస్పష్టంగా మారితే లేదా మీకు ఒక విషయం డబుల్ గా కనిపిస్తే, దానిని దృష్టి బలహీనతగా భావించి విస్మరించవద్దు. ఇది మూత్రపిండాల వ్యాధికి సంకేతం కావచ్చు.
మీ కళ్ళు తరచుగా పొడిబారి, మంటగా లేదా దురదగా ఉంటే, అది మూత్రపిండాలకు సంబంధించిన సమస్య కావచ్చని గుర్తించాలి.
మీ కళ్ళు తరచుగా ఎర్రగా మారితే లేదా ఎటువంటి కారణం లేకుండా రక్తం కారుతున్నట్లు కనిపిస్తే, అది అధిక రక్తపోటు వల్ల కావచ్చు.
కొంతమందికి నీలం, పసుపు రంగులను గుర్తించడంలో క్రమంగా ఇబ్బంది మొదలవుతుంది. మూత్రపిండాల వ్యాధి వల్ల కంటి నరాలు లేదా రెటీనా దెబ్బతింటున్నప్పుడు ఇది జరుగుతుంది.