నల్ల క్యారెట్ మీ డైట్‎లో ఉంటే.. ఆ సమస్యలన్నీ రప్పా రప్పా.. 

11 September 2025

Prudvi Battula 

నల్ల క్యారెట్లలోని పుష్కలంగా ఉన్న యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి కణాల నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి.

వీటిలోని ఆంథోసైనిన్లు కళ్ళకు రక్షణ కవచంలా పని చేస్తాయి. వయస్సు-సంబంధిత మాక్యులర్ క్షీణత ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

కొన్ని అధ్యయనాలు ప్రకారం.. నల్ల క్యారెట్లు మీ ఆహారంలో చేర్చుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని తేలింది.

ఇందులోని ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు మంటను తగ్గించడంతో పాటు రక్త లిపిడ్ ప్రొఫైల్‌లను మెరుగుపరిచి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి.

నల్ల క్యారెట్లు తరచు తినడం వల్ల వాపును తగ్గించడంలో, ఆర్థరైటిస్ వంటి లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.

వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉన్నందున జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించి మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

నల్ల క్యారెట్లలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మాన్ని దెబ్బతినకుండా వృద్ధాప్యాన్ని నెమ్మదించి ఆరోగ్యకరమైన చర్మన్నీ ప్రోత్సహించడంలో సహాయపడతాయి.

కొన్ని అధ్యయనాలు నల్ల క్యారెట్లలోని యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని సూచిస్తున్నాయి.