మల్లెపూలు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ టిప్స్ పాటించండి !

samatha 

27 April 2025

Credit: Instagram

మల్లెపూలు అంటే ఆడవారికి చాలా ఇష్టం. ఇవి మంచి సువాసన వెదజల్లుతూ ఉంటాయి. అందరూ ఇష్టపడే ఈ పూలు ఎక్కవ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే టిప్స్ పాటించాలంట.

ఆడవారు ఎక్కువగా ఇష్టపడే మల్లెపూలు చాలా త్వరగా వాడిపోతాయి. లేదా ఒక్కసారిగా నల్లగా మారిపోతుంటాయి.

ఇక ఏదైనా శుభకార్యం లేదా, వివాహం జరిగే ఇంట్లో ఎక్కువ మోతాదులో మల్లెపూలు తీసుకొచ్చుకొని పెట్టుకుందాం అంటే అవి త్వరగా పాడైపోతాయని ఇబ్బంది పడుతుంటారు.

అయితే మల్లె పూలు ఎక్కవ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు, అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.ఎలా పూలను నిల్వ చేయాలంటే?

మల్లెపూలను కోసి వాటిని అరటి ఆకులో గట్టిగా మడిచి పెట్టుకోవాలంట. తర్వాత వాటిని ఒక పాత్రలో పెట్టి గాలి చొరబడకుండా మూసి వేసి ఫ్రిజ్‌లో ఉంచాలంట.

ఇలా చేయడం వలన మల్లెపూలు వారం రోజుల పాటు పాడవకుండా, ఫ్రెష్‌గా ఉంటాయంట. ఇవే కాకుండా, మరో విధంగా కూడా పూలను నిల్వ చేయవచ్చునంట.

మల్లెపూలను టిష్యూ పేపర్ లో నెమ్మదిగా చుట్టి, వాటిని కాటన్ క్లాత్ లో పెట్టాలి. తర్వాత వాటిని గాలి చొరబడని డబ్బాలో వేసి ఫ్రిజ్లో పెట్టాలంట. దీని వలన పూలు ఫ్రెష్‌గా ఉంటాయంట.

ఒక వేళ పూలను ఫ్రిజ్ లో లేకపోతే, వాటినిఅరటి ఆకులను పెట్టి, తడి కాటన్ క్లాత్ లో పెట్టి, వాటిని గాలి చొరబడి బాక్స్ ల పెట్టి, దాచి పెట్టాలంట. అలా చేయడం వలన పూలు తాజాగా ఉంటాయంట.