బక్కగా ఉన్నామని బాధపడుతున్నారా.. బరువు పెరగడానికి బెస్ట్ టిప్స్ ఇవే

samatha 

06 JUN  2025

Credit: Instagram

చాలా మంది బక్కగా ఉన్నామని బాధపడుతుంటారు. ఇలాంటి వారు లావు కావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ ఎలాంటి ఫలితం ఉండదు.

ఇక కొంత మంది అయితే ఏకంగా లావు కావడానికి మెడిసన్ వాడుతుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు అని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.

అయితే ఎలాంటి మెడిసన్ లేకుండా సులభంగా బరువు పెరగాలి అనుకే వారు తప్పకుండా తమ డైట్‌లో వీటిని చేర్చుకోవాలంట. దీని వలన ఈజీగా బరువు పెరుగుతారంట.

ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు గ్లాస్ బనాన మిల్క్ షేక్ తాగడం వలన త్వరగా బరువు పెరిగే ఛాన్స్ ఉంటుందంట.

అలాగే ప్రతి రోజూ కనీసం రెండు రకాల పండ్లు తీసుకోవాలంట. అలాగే పప్పు ధాన్యాలు తప్పకుండా తినడం వలన బరువు పెరిగే ఛాన్స్ ఉంటుందంట.

అదే విధంగా లావు అవ్వాలి అనుకునే వారు ఉదయం గ్లాస్ పాలు, ఉడకబెట్టిన ఎగ్ తినాలంట. అలాగే పిడికెడు బాదం, పిస్తా తింటే త్వరగా లావు అవుతారంట.

ప్రతి మూడు గంటలకు ఒకసారి ఆహారం తీసుకుంటూ ఉండాలంట. అలాగే పాలు, పెరుగు వంటివి తీసుకోవడం వలన కూడా త్వరగా బరువు పెరిగే ఛాన్స్ ఉంటుందంట.

చాలా మంది కాఫీ, టీలు అధికంగా తీసుకుంటారు. అయితే లావు అవ్వాలి అనుకునే వారు టీ,కాఫీలకు చాలా దూరంగా ఉండాలంట.అలాగే రోజుకు లీటర్ నీళ్లు తాగాలంట.