మందారం అంటే ఫ్లవర్ అనుకున్నారా? మేలు చేసే పవర్.. 

06 August 2025

Prudvi Battula 

మందార పువ్వులు యాంటీఆక్సిడెంట్ల పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి.

మందారంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వాపును తగ్గించడంలో, ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించడంలో ఉపయోగపడతాయి.

మందారం కాలేయాన్ని దెబ్బతినకుండా కాపాడుతుంది. అలాగే దాని పనితీరుని మెరుగుపడుతుందని అంటున్నారు నిపుణులు.

మందారంలో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇది చర్మ, జుట్టు సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.

మందార పువ్వుతో టీ చేసుకొని తాగితే లో బీపీ ఉన్నవారి రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.

కొన్ని అధ్యయనాలు మందార పువ్వు టీ LDL (చెడు) కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని సూచిస్తున్నాయి.

మందార టీ ఆహారంలో కొవ్వు శోషణను నిరోధించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎక్కువ వెయిట్ ఉన్నవారికి ఇది మంచి ఎంపిక.

స్త్రీలలో పీరియడ్స్ నొప్పి,ఇతర PMS లక్షణాల నుంచి ఉపశమనం పొందడానికి మందార టీని సాంప్రదాయకంగా ఉపయోగిస్తున్నారు.