వర్షాకాలం వ్యాధుల కాలం.. సాధారణంగానే ఈ కాలంలో రోగనిరోధక శక్తి బలహీణంగా ఉంటుంది. ఈ కాలంలో ఇన్ఫెక్షన్లు, వివిధ రకాల అనారోగ్యాలు చుట్టుముడతాయి
TV9 Telugu
వీటితో సమర్థంగా పోరాడే శక్తిని పొందాలంటే ఈ కాలంలో ఖర్జూరాల్ని ఆహారంలో చేర్చుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఇవి ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడడంతో పాటు.. ఆరోగ్యపరంగా బోలెడన్ని ప్రయోజనాలు అందిస్తాయట
TV9 Telugu
ఖర్జూరం పోషకాల నిధి. ఇందులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ మరియు అనేక రకాల విటమిన్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి
TV9 Telugu
ఖర్జూరంలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో, తక్షణ శక్తిని అందించడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది
TV9 Telugu
ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 3 ఖర్జూరాలు తింటే.. మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. పైగా కడుపు నిండుగా ఉంచుతుంది
TV9 Telugu
ఖర్జూరాలు సహజ చక్కెరను కలిగి ఉంటాయి. అందుకే అవి మధుమేహ రోగులకు చాలా మంచివిగా పరిగణించబడతాయి. ఇది స్వీట్లు తినాలనే కోరికను కూడా తగ్గిస్తాయి
TV9 Telugu
ఖర్జూరంలో ఐరన్ కూడా పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత రోగులకు ఇది మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల రక్తహీరత లోపం తొలగిపోతుంది. హిమోగ్లోబిన్ పెరగడంలో కూడా సహాయపడుతుంది
TV9 Telugu
ఐరన్ అధికంగా ఉండే ఖర్జూరాలు ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఖర్జూరం తినడం వల్ల జీర్ణవ్యవస్థ సైతం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి అనేక కడుపు సమస్యలను కూడా దూరం చేస్తుంది