రోజంతా ఏసీ కింద ఉంటున్నారా.? ఆ సమస్యలకి ఆహ్వానం పలికినట్టే..
23 September 2025
Prudvi Battula
ఏసిలు గాలిలోని తేమను తొలగిస్తాయి, దీని వలన చర్మం పొడిబారి, పొరలుగా మారడం, చికాకు కలిగిస్తుంది. ఎక్కువసేపు దీని కింద ఉంటే ముడతలు వస్తాయి.
ఎయిర్ కండిషనింగ్ వల్ల డీహైడ్రేషన్ వస్తుంది. దీని వలన దాహం, నీరసం, అలసట పెరుగుతుంది. దీని కింద ఉంటే పుష్కలంగా నీరు త్రాగడం మంచిది.
ఏసీ నుండి వచ్చే చల్లని, పొడి గాలి శ్వాసకోశ వ్యవస్థను చికాకుపెడుతుంది. ఆస్తమా, అలెర్జీలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వంటి పరిస్థితులను తీవ్రతరం చేస్తుంది.
ఎక్కువ సమయం ఏసీలో ఉంటే మీ కళ్ళ పొడిబారి దురద, ఎరుపు, చికాకు కలిగిస్తాయి. ఇది కాంటాక్ట్ లెన్స్ ధరించేవారికి ముఖ్యంగా అసౌకర్యంగా ఉంటుంది.
ఏసీ తలనొప్పి, మైగ్రేన్‌లను కారణంగా ఉంది. ఆకస్మిక ఉష్ణోగ్రత మార్పులు రక్త నాళాలు కుంచించుకుపోయి మైగ్రేన్ తరహా తలనొప్పి వస్తుంది.
ఏసీల నుండి వచ్చే చల్లని, పొడి గాలితో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ముఖ్యంగా మీరు ఏసీ గాలి ప్రవాహం కింద నేరుగా కూర్చున్నప్పుడు కండరాల దృఢత్వం, కీళ్ల నొప్పులకు కారణమవుతుంది.
ఏసీ-కూల్డ్ ప్రదేశాలలో ఎక్కువ సమయం గడపడం వల్ల బద్ధకంగా, అలసిపోయినట్లు అనిపించవచ్చు. ఇది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
బాత్రూమ్లో వీటిని ఉంచితే.. దరిద్రంతో రూమ్ షేర్ చేసుకున్నట్టే..
స్మార్ట్ఫోన్కు ఫాస్ట్ ఛార్జర్ హానికరమా? వాస్తవం ఏంటి.?
ఒక వ్యక్తి రోజులో ఎన్నిసార్లు కన్నురెప్పలు కొడతారో తెలుసా?