ఈ కొండల్లో మీ ప్రయాణం మరిచిపోలే జ్ఞాపంకమే..బ్యూటిపుల్ ప్లేసెస్

samatha 

18 MAY 2025

Credit: Instagram

సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది టూర్ వెళ్దాం అని ప్లాన్ చేస్తుంటారు. ముఖ్యంగా పచ్చని ప్రకృతి, ఎత్తైన కొండల  మధ్య ఆనందంగా గడపడానికి ఎక్కువ ఇష్టపడుతారు.

అయితే అలా మిమ్మల్ని ఆనంద పరచడానికి బెస్ట్ హిల్ స్టేషన్ లో దక్షిణ భారత దేశంలో ఉన్నాయంట. ఇవి నిత్యం వేలాది మంది పర్యాటకులతో పచ్చని చెట్లతో కలకలలాడుతాయంట.

కానీ వీటి గురించి చాలా మందికి తెలియదు. అయితే ఈ అద్భుతమైన ప్రదేశాలు ఎక్కడెక్కడున్నాయో ఇప్పుడు చూసేద్దాం.

 భారతదేశంలోని తేన్మల కేరళలోని ఇది  పచ్చని అడవులు, తాడు వంతెలనలు, బూటింగ్, సీతాకోక చిలుకల పార్క్ , జింకల పార్క్ సంగీత ఫౌంటెన్లు ఇలా ఎన్నో ఉన్న తేన్మల పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది.

చల్లటి వాతావరణం, పచ్చని చెట్లు, కొండలు జలపాతాలు, పురాతన ఋషుల ఇతిహాసాలతో కూడిన తమిళనాడు కొల్లి కొండలు ప్రయాణం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది.

ఊటీకి ప్రశాంతమైన బంధువు కోటగిరి. ఇది నీలగిరిలోని పురాతన హిల్ స్టేషన్. విశాలమైన టీ ఎస్టేట్‌లు, కేథరీన్ జలపాతం వంటి అందమైన ట్రెక్కింగ్‌లు ఇది అద్భుతమైన పర్వత ప్రయాణం

అనామలై కొండలలో దాగి ఉన్న వల్పరై, టీ ప్రియులకు, వన్యప్రాణులను ఇష్టపడే వారికి ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు.  ఈ హిల్ స్టేషన్ పర్యాటకులకు బెస్ట్ మెమోరీగా మారిపోతుంది.

సూఫీ సన్యాసి పీర్ మొహమ్మద్ పేరు మీద ఉన్నఈ హిల్ స్టేషన్ అంతగా ప్రసిద్ధి చెందలేదు. ఇడుక్కి జిల్లాలోని ఏలకులు, పైన్ అడవులతో సమృద్ధిగా ఉంది.