ఈ పువ్వు షుగర్‌ ఉన్నవారికి దివ్య ఔషధం..!

05 October 2025

Jyothi Gadda

అరటి పువ్వు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. షుగర్‌ ఉన్నవారికి అరటి పువ్వు ఔషధం!

అరటి పువ్వుల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. మెగ్నీషియం సాధారణంగా మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆందోళనను తగ్గించి మానసిక ప్రశాంతతను పెంచుతుంది. 

అరటి పువ్వులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తం లోపాన్ని తీర్చడంలో సహాయపడుతుంది. ఈ కారణంగా రక్తహీనతతో బాధపడేవారు దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి.

యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ ప్రభావం నుండి రక్షించి, సెల్ డ్యామేజ్‌ను తగ్గిస్తాయి. మధుమేహం వల్ల కలిగే మానసిక నష్టం లేదా ఇతర అవయవ నష్టాన్ని కూడా తగ్గిస్తుంది.

అరటి పువ్వు నెఫ్రో ప్రొటెక్టివ్ యాక్టివిటీని కలిగి ఉంది. ఇది కిడ్నీ దెబ్బతినకుండా కాపాడుతుంది. అరటి పువ్వులలో ఉండే పీచు మూత్రపిండాల్లో రాళ్లతో పోరాడుతుంది. 

అరటి పువ్వులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి ప్రోస్టేట్ గ్రంధి పరిమాణాన్ని తగ్గిస్తుంది. దీనిలోని సిట్రిక్ యాసిడ్, అమినో యాసిడ్స్ ప్రోస్టేట్ గ్రంధిని సాధారణ స్థితికి తెస్తుంది.

అరటి పువ్వు అధిక రక్తపోటు సమస్యను దూరం చేస్తుంది. ఇది యాంటీ హైపర్‌టెన్సివ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించగలదు. 

ఇందులో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు, అనేక పోషకాలు అనేక ఇతర వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తాయి. అరటి పువ్వులో ఉండే జింక్ ఎముకల నష్టాన్ని నివారిస్తుంది.