ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఈ పువ్వు సంజీవని.. ఒక్కటి తిన్నా వ్యాధులు మాయం
21 July 2025
Pic Credit: freepik.com
TV9 Telugu
అరటి పువ్వుల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనిని తినడం వలన అందులోని మెగ్నీషియం మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మానసిక ప్రశాంతతను పెంచుతుంది.
అరటి పువ్వులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తం లోపాన్ని తీర్చడంలో సహాయపడుతుంది. రక్తహీనతతో బాధపడేవారు ఈ పువ్వుని క్రమం తప్పకుండా తీసుకోవాలి.
అరటిపువ్వు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడటంతో పాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అరటి పువ్వులోని టానిన్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, ఆక్సీకరణ నష్టాన్ని తొలగిస్తాయి. తద్వారా గుండె రోగులలో అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది
దీనిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ ప్రభావం నుంచి రక్షించి, సెల్ డ్యామేజ్‌ను తగ్గిస్తాయి. దీని వల్ల మధుమేహం వల్ల కలిగే అనేక ఇబ్బందులను తగ్గించుకోవచ్చు.
అరటి పువ్వు నెఫ్రో ప్రొటెక్టివ్ యాక్టివిటీని కలిగి ఉంది. ఇది కిడ్నీ దెబ్బతినకుండా కాపాడుతుంది. అరటి పువ్వులలో ఉండే పీచు మూత్రపిండాల్లో రాళ్లని కరిగిస్తుంది.
అరటి పువ్వులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ప్రోస్టేట్ గ్రంధి పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులోని సిట్రిక్ యాసిడ్, అమినో యాసిడ్స్ ప్రోస్టేట్ గ్రంధిని సాధారణ పరిమాణానికి తీసుకువస్తాయి.
అరటి పువ్వు అధిక రక్తపోటు సమస్యను దూరం చేస్తుంది. ఇది యాంటీ హైపర్‌టెన్సివ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది.
అరటి పువ్వులో ఉండే జింక్ ఎముకల నష్టాన్ని నివారిస్తుంది. ఇందులో క్వెర్సెటిన్, కాటెచిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఎముకల నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి.