వీటిని గుర్తుపట్టారా.. రోజుకొక్కటి నోట్లో వేసుకున్నారంటే..
22 August 2025
TV9 Telugu
TV9 Telugu
ప్రతి వంటగదిలో రకరకాల సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. వాటిలో లవంగం ఒకటి. లవంగాలు వంటకాలకు రుచినీ, చక్కటి సువాసననూ ఇవ్వడమే కాదు... ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తాయి
TV9 Telugu
థయామిన్, రైబోఫ్లెవిన్, నియాసిన్, ఫోలేట్ వంటి పోషకాలు లవంగాల్లో పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ ఒంట్లోని రోగనిరోధకశక్తినీ, శరీర వ్యవస్థల పనితీరునీ మెరుగుపరుస్తాయి
TV9 Telugu
ముఖ్యంగా జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తాయి. లవంగంలో ఉండే యూజెనాల్ హర్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తుంది. ఫలితంగా ఒత్తిడి, ఆందోళన అదుపులో ఉంటాయి
TV9 Telugu
ప్రతి ఉదయం ఒక లవంగాన్ని నమిలి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజుకో లవంగం తినడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొవ్వు కాలేయ సమస్య నయమవుతుంది
TV9 Telugu
ప్రతి ఉదయం ఒక లవంగాన్ని నమలడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. అలాగే నోటిలో, ప్రేగులలో జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తి మెరుగుపడి, జీర్ణక్రియను సులభతరం చేస్తుంది
TV9 Telugu
ప్రతిరోజూ ఉదయాన్నే ఓ లవంగం మొగ్గ నమిలి తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యల నుంచి వేగంగా ఉపశమనం లభిస్తుంది. అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది
TV9 Telugu
లవంగాలు ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకే ప్రతిరోజూ ఉదయం ఒక లవంగాన్ని తినడం వల్ల ఎముకలు బలపడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు
TV9 Telugu
దీనితో పాటు దంతాల ఆరోగ్యానికి కూడా లవంగం ఉపయోగకరంగా ఉంటుంది. లవంగాలు నమలడం వల్ల చిగుళ్ల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. లవంగాల్లో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు నోటి దుర్వాసనను అడ్డుకుంటాయి