అవకాడో.. దీనిని బటర్ ఫ్రూట్ (వెన్న పండు) అని కూడా అంటారు. పియర్స్ లేదా అండాకారంలో ఉండే ఈ పండు గర్భాశయాన్ని పోలి ఉంటే, అందులోని గింజ... శిశువుని తలపిస్తుంది
TV9 Telugu
తల్లి గర్భంలో శిశువు నవమాసాలు ఉన్నట్లే, ఈ పిందె... ఫలంగా రూపుదిద్దుకోవడానికి ఆరు నుంచి తొమ్మిది నెలలు పడుతుందట. అవకాడో పండులో గర్భిణులకి ఎంతో మేలు చేసే పోషకాలు అధికంగా ఉంటాయి
TV9 Telugu
గర్భిణులకే కాదు మహిళలందరి ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉండటమే కాదు. మహిళల ఆరోగ్యానికి మంచిది. లేత పచ్చ రంగు అవకాడో గుజ్జులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, బి2, బి3, బి5, బి6, సి, ఇ, కె-విటమిన్లతోపాటు ఫోలిక్ ఆమ్లం, ఖనిజాలు... వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
ఇవన్నీ హార్మోన్ల సమతౌల్యానికీ పీసీఓడీ, మెనోపాజ్ సమస్యల నివారణకీ సంతానోత్పత్తికీ గర్భిణుల ఆరోగ్యానికీ దోహదపడతాయి. ఇది మహిళల ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉండటమే కాదు
TV9 Telugu
అవకాడోలోని బోరాన్, మెగ్నీషియం, ఫ్యాటీ ఆమ్లాలు గర్భాశయ సంకోచాలకు కారణమయ్యే ప్రొస్టాగ్లాండిన్ స్రావాన్ని అడ్డుకోవడంతో నెలసరిలో వచ్చే నొప్పులు తగ్గుతాయి. అవకాడోను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పీరియడ్స్ క్రమబద్ధీకరించబడతాయి
TV9 Telugu
అవకాడోలో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇందులో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు కూడా సమృద్ధిగా ఉంటాయి
TV9 Telugu
ఇవి మహిళల హార్మోన్లను సమతుల్యం చేయడంలో ఉపయోగపడతాయి. అవకాడో గర్భధారణకు కూడా మంచిది. దీనిలోని అధిక ఫోలిక్ యాసిడ్ కంటెంట్ గర్భధారణకు ముందు, గర్భధారణ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది
TV9 Telugu
అవకాడో పిండం అభివృద్ధికి కూడా సహాయపడుతుంది. అందుకే గర్భిణీలు దీనిని క్రమంతప్పకుండా తీసుకోవాలి. ఈ పండు గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. అంతే కాదు కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఈ పండులోని అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది