రాస్ప్బెర్రీస్ ఈ ఆహారంలో చేర్చుకుంటే.. ఆ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టే.. 

Prudvi Battula 

23 September 2025

రాస్ప్బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. వాపును తగ్గిస్తాయి.

రాస్ప్బెర్రీలలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉన్నందున కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని దూరం చేస్తాయి.

వీటిలోని ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

రాస్ప్బెర్రీస్ ఫైబర్‎కి మంచి మూలం. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించి మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

రాస్ప్బెర్రీస్ మాంగనీస్, రాగి, మెగ్నీషియం వంటి ఖనిజాలకు మంచి మూలం. వీటిని తింటే ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వాపును తగ్గించడంలో, ఆర్థరైటిస్ వంటి పరిస్థితులను దూరం చేయడంలో సహాయపడతాయి.

దీనిలో పుష్కలంగా లభించే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పెద్దప్రేగు, రొమ్ము క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

రాస్ప్బెర్రీస్‎లో ఉన్న విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మపై ఉన్న ముడతలను తగ్గించి వృద్ధాప్యాన్ని నెమ్మదిస్తాయి.