ఆప్రికాట్ మీ డైట్లో ఉంటే.. ఆ సమస్యలపై బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టే..
13 August 2025
Prudvi Battula
ఆప్రికాట్లో విటమిన్ ఎ, సిలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కళ్ళను రక్షించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
ఆప్రికాట్లో అధికంగా ఉన్న విటమిన్ ఎ కంటి దృష్టిని మెరుగుపరచడమే కాకుండా సంబంధిత సమస్యలను నివారించడానికి ఉపయోగపడుతుంది.
ఆప్రికాట్లోని విటమిన్ సి తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థకు పెంచుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.
వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరిచి వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.
ఇందులోని పొటాషియం కంటెంట్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిలో ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో తగ్గించి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
దీనిలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ప్రేగు కదలికలను నియంత్రించి మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు తోడ్పడుతుంది.
ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడతాయి.
ఆప్రికాట్లలోని కాల్షియం, పొటాషియం, ఇతర ఖనిజాల ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి. బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి.