ఆయుర్వేదం ప్రకారం.. ఇలా స్నానం చేస్తే.. సమస్యలన్ని ఫసక్.. 

01 September 2025

Prudvi Battula 

మన ఆరోగ్యంలో స్నానం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది శరీరం నుండి మురికి, చెమట, మలినాలు తొలగించి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.

ఆయుర్వేదం ప్రకారం స్నానం చేసే సమయం, సరైన నీటి ఉష్ణోగ్రత ఉపయోగించడం వల్ల అనారోగ్యాలను నివారించడానికి సహాయపడుతుంది.

రోజుకు రెండు సార్లు స్నానం చేయాలి. మొదటిగా సూర్యోదయానికి ముందు మల విసర్జన, దంతాలు శుభ్రం చేసి చెయ్యాలి.

మరొక సారి సూర్యాస్తమయం సమయంలో గోరువెచ్చని నీటితో, ఒత్తిడిని తగ్గించడానికి, మీ కండరాలు, నరాల విశ్రాంతి కోసం చేయాలి. ఇది మంచి నిద్రని ఇస్తుంది.

ఒక వ్యక్తి ఏనుగులా స్నానం చేయాలని ఆయుర్వేద గ్రంథం పేర్కొంది. దీని అర్థం మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోవడానికి తగినంత నీటిని ఉపయోగించాలి.

స్నానానికి ముందు శరీరాన్ని నూనెతో మర్ధన చేయాలి. దీనికి నువ్వుల నూనె అత్యంత శ్రేష్టమైనది. మీరు కొబ్బరి నూనె లేదా బాదం నూనెను కూడా ఉపయోగించవచ్చు.

ఆయిల్ మసాజ్ తర్వాత, స్నానం చేసే ముందు శనగ పిండి, పెసర పిండి, పసుపు, గులాబీ రేకులు, చందనం, వేప ఆకులు వంటి వాటితో చేసిన హెర్బల్ పౌడర్‌ను శరీరంపై రుద్దండి.

స్నానం చేయడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించడం మంచిది. మీ జుట్టు, కళ్లకు ముప్పును నివారించడానికి మీ తలపై వేడినీటిని పోయకుండా ఉండటం మంచిది.

అలాగే భోజనం చేసిన వెంటనే తలస్నానం చేయవద్దు. స్నానం చేసేటప్పుడు ముందుగా నీటిని తలపై కాకుండా ముందుగా కాళ్లు, నడుము భాగం వరకు కడిగి ఆ పై క్రమంగా పైకి రావాలి.