రోజుకు ఒక గ్లాస్ పైనాపిల్ జ్యూస్.. ఆ సమస్యలన్నీ ఖతం.. 

26 September 2025

Prudvi Battula 

వయసు కారణంగా చర్మం ముడతలు రావడం సహజం. రోజు పైనాపిల్ జ్యూస్ తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా, మృదువుగా తయారువుతుంది.

పైనాపిల్ జ్యూస్ ఉదరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫాస్ట్ ఫుడ్ తిన్నప్పుడు కడుపు సమస్యగా అనిపిస్తే ఈ జ్యూస్ తాగండి.

పైనాపిల్ జ్యూస్ రెగ్యులర్‎గా తాగితే మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది.

ఈ జ్యూస్ తరచూ తాగితే ఎన్నో వ్యాధులు దూరం అవుతాయి. అలాగే రోగనిరోధక వ్యవస్థ ఎంతో చురుకుగా పనిచేస్తుంది.

ఈ రసాన్ని రోజు తాగితే జలుబు, దగ్గు నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తుందన్నది పోషకాహార నిపుణులు చెబుతున్న మాట.

పైనాపిల్ జ్యూస్ జుట్టు రాలడం తగ్గిస్తుంది. రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. అలాగే ఆడవారికి నెలసరి సక్రమంగా వచ్చేలా చేస్తుంది.

బాగా పండిన పైనాపిల్ తింటే పళ్ళ నుంచి రక్తం కారే స్కర్వీ వ్యాధి, కడుపులో పురుగులు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

పైనాపిల్‌లోని ఎంజైమ్స్‌ వాపులను, నాసికా వ్యాధులు, టైఫాయిడ్‌ వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఇది పచ్చకామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధులను కూడా తగ్గిస్తుంది.