05January 2025

ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారా.. ఈ ఫుడ్ విషయంలో జాగ్రత్త!

TV9 Telugu

పెళ్లైన ప్రతి మహిళా తల్లి కావాలనుకుంటుంది. కానీ ఇప్పుడు మనం తీసుకుంటున్న ఆహారం జీవన శైలి కారణంగా గర్భందాల్చడం పెద్ద సమస్యగా మారింది.

పెళ్లై సంవత్సరాలు గడుస్తున్నా, చాలా మందికి ప్రెగ్నెన్సీ అనేది రావడం లేదు. దీంతో ఎన్నో జంటలు మానసికంగా చాలా కుంగిపోతున్నారు..

తల్లిదండ్రులు కావాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా, అవి విఫలం కావడానికి మనం తీసుకునే ఆహారం కూడా ఓ కారణం కావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అందుకే తల్లిదండ్రులు కావాలి అనుకునేవారు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు వైద్యులు.

ముఖ్యంగా మహిళలు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంట. కాగా, వారు ఎలాంటి ఆహారం తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రెగ్నెన్సీకి ట్రై చేసే మహిళలు ఎక్కువ టీ, కాఫీలు అస్సలు తీసుకోకూడదు. దీనిలో ఉండే అధిక కెఫైన్ ఫెర్టిలిటీ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

ఆల్కహాల్, ఫాస్ట్ ఫుడ్ ప్రాసెస్ చేసిన ఫుడ్ తినకూడదంట. దీని వలన హార్మోనల్ ఇంపాక్ట్ వచ్చి గర్భందాల్చడం కష్టం అవుతుందంట.

అలాగే శరీరానికి వేడిని కలిగించే ఆహారాలు కూడా అస్సలే తీసుకోకూడదు. దీని వలన ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవుతుంది.

అదే విధంగా అధిక సోడియం ఉన్న ఆహారాలు కూడా తినకూడదంట. మంచి సమతుల్య ఆహారం తీసుకోవడం వలన గర్భం దాల్చడంలో సమస్యలు రావు.