05January 2025

సండే అని చికెన్, మటన్ లాగేస్తున్నారా..ఈ విషయం తెలుసుకోవాల్సిందే!

TV9 Telugu

నాన్ వెజ్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. చికెన్, మటన్‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు.

ఇక సండే వచ్చిందంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆర్డర్ చేసి, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలను లాగించేస్తుంటారు.

కొందరు  నాన్ వెజ్‌ను వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తింటే మరికొందరు మాత్రం వారానికి నాలుగైదు సార్లు తింటుంటారు.

 అయితే ఇలా తరుచూ చికెన్ లేదా మటన్ అతిగా తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు వైద్య నిపుణులు.

 కాగా, చికెన్ లేదా మటన్‌ను ఎక్కువగా తినడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మాంసంలో కొవ్వు అధికంగా ఉంటుంది. దీని వలన అధిక  బరువు పెరగడం, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి.

అంతే కాకుండా జీర్ణ సంబంధ వ్యాధులు వస్తాయి. అందువలన తరచుగా కాకుండా, కనీసం వారంలో ఒకటి లేదా రెండు సార్లు తీసుకోవాలంటున్నారు వైద్యులు.