ప్రయాగ్‌రాజ్‎ని ప్రధానమంత్రి నగరం అంటారని తెలుసా.?

TV9 Telugu

08 February 2025

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆధ్యాత్మిక నగరంగా పేరు పొందిన పురాతన పట్టణం ప్రయాగ్‌రాజ్‎ని ప్రధానమంత్రి నగరం అంటారు.

వాస్తవానికి, ప్రయాగ్‌రాజ్ ప్రాంతం నుండి భారతదేశానికి మొత్తం ఏడుగురు ప్రధానమంత్రులుగా సేవలు అందించారు.

యూపీలోని ప్రయాగ్‌రాజ్ నగరాన్ని ప్రధానమంత్రి నగరంగా పిలవడానికి ఇదే బలమైన కారణం. మరి ఇంకో కారణం ఏమి లేదు.

ప్రయాగ్‌రాజ్ నగరం స్వతంత్ర పోరాట నాయకుడు, దేశ తొలి ప్రధానిగా సేవలు అందించిన జవహర్‌లాల్ నెహ్రూ జన్మస్థలం.

లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి మూడవ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రయాగ్‌రాజ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో రెండుసార్లు గెలిచారు.

నెహ్రు కుమార్తె, భారతదేశ తొలి మహిళా ప్రధానిగా పని చేసిన ఇందిరా గాంధీ కూడా ప్రయాగ్‌రాజ్‌లోనే జన్మించారు.

ఇందిరా గాంధీ కుమారుడు, దేశనికి 6వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ కూడా ఈ ప్రాంతానికి చెందిన వారే కావడం విశేషం.

భారతదేశనికి 7వ ప్రధానమంత్రిగా సేవలు అందించిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ జన్మస్థలం కూడా ప్రయాగ్‌రాజ్ నగరం.