చర్మం నల్లబడుతోందా...? ఇలా చేసి చూడండి !

చర్మం నల్లబడుతోందా...? ఇలా చేసి చూడండి !

image

TV9 Telugu

01 February 2025

కాంతివంతమైన చర్మంతో ఉన్నవారు కూడా కొన్నిసార్లు ఉన్నట్టుండి నల్లబడిపోతుంటారు. చర్మం కళావిహీనమైపోతుంది.

కాంతివంతమైన చర్మంతో ఉన్నవారు కూడా కొన్నిసార్లు ఉన్నట్టుండి నల్లబడిపోతుంటారు. చర్మం కళావిహీనమైపోతుంది.

కాంతివంతమైన చర్మం నల్లబడటానికి అసలు కారణం ఏంటి.? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి.? ఈరోజు మనం తెలుసుకుందాం..

కాంతివంతమైన చర్మం నల్లబడటానికి అసలు కారణం ఏంటి.? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి.? ఈరోజు మనం తెలుసుకుందాం..

జీర్ణ వ్యవస్థ పనితీరుకు, మన చర్మం రంగుకు లింక్ ఉంటుంది. మనం తినే ఆహారం నుంచి తగిన పోషకాలు శరీరానికి అందాలంటే ఆ ఆహారం బాగా జీర్ణం కావాలి.

జీర్ణ వ్యవస్థ పనితీరుకు, మన చర్మం రంగుకు లింక్ ఉంటుంది. మనం తినే ఆహారం నుంచి తగిన పోషకాలు శరీరానికి అందాలంటే ఆ ఆహారం బాగా జీర్ణం కావాలి.

అదే సమయంలో రక్తం పోషకాలను బాగా సంగ్రహించగలగాలి. ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా చర్మంపై ప్రభావం పడుతుంది.

జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయకుంటే శరీరంలో ఇన్ ఫ్లమేషన్ స్థితి తలెత్తుతుంది. ఇది చర్మాన్ని కళావిహీనంగా చర్మం పొడిబారేలా చేస్తుంది.

అంతేకాదు ఎసిడిటీ, గ్యాస్, ఇతర జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారిలో కళ్లకింద నల్లటి వలయాలు ఎక్కువగా ఏర్పడతాయి.

జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా పనిచేయాలంటే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవడం అవసరం.

ప్రొబయాటిక్స్‌ ఉన్న పెరుగు తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవడం, శరీరానికి తగిన వ్యాయమం, విశ్రాంతి, నిద్ర ఉండేలా చూసుకోవడం ముఖ్యం.