ఏయే దేశాల్లో ఐరన్ డోమ్ ఉందో తెలుసా?
TV9 Telugu
01 February 2025
ఆసియా ఖండ దేశం ఇజ్రాయెల్ వద్ద ఉన్న అత్యంత ప్రసిద్ధ మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌లో ఐరన్ డోమ్ కూడా ఒకటి.
ఈ ఐరన్ డోమ్ రాకెట్లు, ఫిరంగి గుండ్లు, మోర్టార్ కాల్పుల నుండి ఇజ్రాయెల్‌ను రక్షించడానికి రూపొందించారు.
ఇది 4 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో వచ్చే ముప్పులను గుర్తించి వాటిని నివారిస్తుంది. ఇంకా ఏ దేశాల్లో ఐరన్ డోమ్ ఉంది.
భారతదేశంలో సొంత ఎయిర్ డిఫెన్స్ మెకానిజంతో ఐరన్ డోమ్ రూపొందించుకుంది. భారత్ - ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా అభివృద్ధి చేసింది.
అమెరికాలో సైతం ఐరన్ డోమ్ ఉంది. అమెరికా 2019లో ఐరన్ డోమ్ భాగాలను కొనుగోలు చేసింది. ఇది రాడార్, ఇతర భాగాలతో పాటు రెండు బ్యాటరీలను కలిగి ఉంటుంది.
బ్రిటన్ దేశం తన స్కై సాబర్ వ్యవస్థను నిర్మించడానికి ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీని కొనుగోలు చేయడం జరిగింది.
ఇందులో అగ్నిమాపక నియంత్రణ కేంద్రం, స్వీడిష్ రాడార్, బ్రిటిష్ అభివృద్ధి చేసిన కామన్ యాంటీ-ఎయిర్ మాడ్యులర్ మిస్సైల్ (CAMM) ఉన్నాయి.
అలాగే అజర్‌బైజాన్, కెనడా, హంగరీ, రొమేనియా వంటి మరికొన్ని దేశాల్లో కూడా ఇలాంటి ఐరన్ డోమ్‌లు ఉన్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఉల్లి పాయల కట్ చేసి ఫ్రిజ్‌లో పెడుతున్నారా.? ఇది మీ కోసమే..
ఏళ్ల నాటి నలంద విశ్వవిద్యాలయం గురించి కొన్ని విశేషాలు..
బులెట్ తగిలిన వ్యక్తి మరణించడానికి కారణం ఇదే..