ఒకొక్క పార్ట్‎తో ఒక్కో లాభం.. చికెన్ తింటే.. ఆరోగ్యంతో లైఫ్ షేర్ చేసుకొన్నట్టే.. 

08 August 2025

Prudvi Battula 

చికెన్ తినడం వల్ల శరీరానికి ప్రోటీన్ పుష్కలంగా లబిస్తుంది. ఇది అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలను బాడీకి అందిస్తుంది.

చికెన్‌ను ఆరోగ్యకరమైన ఆహారంలో చేర్చవచ్చు. దీన్ని తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

చికెన్ బ్రెస్ట్‎లో కండరాల పెరుగుదల అవసరమైన లీన్ ప్రోటీన్ ఎక్కువగా ఉంది. ఇందులో కొవ్వు తక్కువగా ఉంటుంది.

చికెన్ థైస్ ఎర్ర రక్త కణాలకు సహాయపడుతుంది. వాటిలో నియాసిన్, విటమిన్ B6, విటమిన్ B జీవక్రియ, నరాల పనితీరును మెరుగుపరుస్తాయి.

చికెన్ వింగ్స్‎లో కొల్లాజెన్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మం. కీళ్ల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. రెక్కల్లో ప్రోటీన్ కూడా ఉంటుంది.

చికెన్ లివర్ తింటే ఐరన్, విటమిన్లు ఎ, బి12 లభిస్తాయి. వీటిలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

చికెన్ డ్రమ్ స్టిక్స్ ప్రోటీన్, ఫాస్పరస్ వంటి ఖనిజాలను కలిగి ఉంటాయి. ఇది ఎముకలను దృడంగా ఉండేలా చేస్తాయి.

చికెన్ డ్రమ్ స్టిక్స్‎ను లెగ్ పీస్ అని కూడా అంటారు. వీటిని చాల రకాల రెసిపీలు చేసుకొని ఇష్టంగా తింటారు.