వారెవ్వా..నిమ్మ తొక్కలతో నమ్మలేనన్ని ప్రయోజనాలు..!

22 July 2025

Prudvi Battula 

నిమ్మకాయ తొక్కలను చాలామంది వ్యర్థంగా పారేస్తుంటారు. కానీ వాటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

నిమ్మ తొక్కలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు నిపుణులు.

ఇవి మాత్రమే కాదు, పవర్‌ఫుల్ బయోయాక్టివ్ కాంపౌండ్స్ కూడా ఉన్నాయి. D-లైమోనిన్ అనే కాంపౌండ్ హృదయ సంబంధిత సమస్యలు, డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

నిమ్మ తొక్కలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, కోలన్‌ను శుభ్రం చేసి, బ్లోటింగ్‌ను తగ్గిస్తుంది.

అంతేకాదు, నిమ్మకాయ తొక్క చర్మంపై ఉన్న డార్క్ స్పాట్స్, ముడతలను తగ్గించడంలో కూడా నిమ్మ తొక్క సహాయపడుతుంది.

ఎండబెట్టిన నిమ్మ తొక్క పొడి చేసి వంట సోడా, ఉప్పుతో కలిపి పళ్ళు తోముకోవడం వల్ల పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.

నిమ్మ తొక్కలో ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీని కారణం ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.

నిమ్మ తొక్కలు జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. వీటితో చుండ్రు, జుట్టు రాలడం తగ్గుముఖం పడుతుంది.