వర్షాకాలంలో ఈ స్ట్రీట్ ఫుడ్ తింటున్నారా.. ఆసుపత్రి బెడ్ ఎక్కాల్సిందే!
samatha
29 JUN 2025
Credit: Instagram
వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది అంటు వ్యాధులు, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యల బారిన పడుతారు. అందుకే ఈ సీజన్‌లో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటారు.
ముఖ్యంగా రోడ్డుపై ఉండే కొన్ని రకాల స్ట్రీట్ ఫుడ్ అస్సలే తినకూడదంట. దీని వలన అనేక సమస్యలు చుట్టుముడుతాయంట. కాగా ఎలాంటి స్ట్రీట్ ఫుడ్ తినకూడదో ఇప్పుడు చూద్దాం.
అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఇష్టంగా తినే స్ట్రీట్ ఫుడ్‌లో పానీ పూరీ ఒకటి. అయితే వర్షాకాలంలో ఇది అస్సలే తినకూడదంట. ఇవి ఫుడ్ పాయిజనింగ్‌కు కారణం అవుతాయంట.
అదేవిధంగా, వర్షం పడుతుంటే చల్లటి వాతావరణంలో చాలా మంది టీ, సమోసా తినడానికి ఎక్కువ ఇష్టపడుతారు. కానీ సమోసా తినడం వలన ఇది ఇన్ఫెక్షన్స్ పెంచుతుందంట
అలాగే వీధుల్లో చేసే వేయించిన పకోడీలు అస్సలే తినకూడదంట. దీని వలన కడుపు నొప్పి, జీర్ణసమస్యలు, వికారం వంటి అనారోగ్య సమస్యలు దరి చేరుతాయంట.
ఈ మధ్య చాలా మంది ఎంతో ఇష్టంగా రోడ్డుపై న్యూడిల్స్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే వర్షకాలంలో ఎట్టిపరిస్థితిలో రోడ్డుపై వండే ఈ స్ట్రీట్ ఫుడ్ తినకూడదంట.
ఇక కొంత మంది నూనెలో వేయించిన ఫుడ్ కాకుండా, రోడ్లపై బండి మీద అమ్మే కట్ చేసిన పెట్టిన ఫ్రూట్స్ తింటుంటారు. అయితే వర్షకాలంలో ఇవి తినడం కూడా మంచిది కాదంట.
అలాగే వర్షకాలంలో ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపై అమ్మే జిలేబీ వంటి స్వీట్స్ తినకూడదంట. ఇది కడుపులో తిమ్మిరి వంటి సమస్యలకు కారణం అవుతుందంట.