విటమిన్ డి లోపిస్తే కనిపించే లక్షణాలు ఇవే!

samatha 

22 JUN  2025

Credit: Instagram

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మంది సరైన ఆహారం తీసుకోక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.

అందుకే వైద్య నిపుణులు తప్పకుండా, మంచి పోషకాహారం తీసుకోవాలి. ముఖ్యంగా శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలని సూచిస్తారు.

కానీ కొంత మంది నిర్లక్ష్యం వారిలో విటమిన్ లోపం వస్తుంది.దీంతో వారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే డి విటమిన్ లోపిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో చూద్దాం.

మీరు కంటి నిండా నిద్రపోయినా, ఏదో అలసట, తలనొప్పి వంటి సమస్యలు ఉన్నట్లైతే అది డి విటమిన్ లోపమే అంటున్నారు వైద్య నిపుణులు.

అదే విధంగా, కాళ్ల నొప్పులు, ఎముకల బలహీనత, కాళ్లు,చేతులు లాగినట్లు అనిపించడం. పొత్తికడుపులో నొప్పి వంటివి డి విటమిన్ లోపం వలన వచ్చే సమస్యలంట.

విపరీతమైన బలహీనత, కనీసం మొట్లు ఎక్కేంత ఓపిక లేకపోవం, కండరాలు బలహీనంగా అనిపించడం, ఊరికూరికే తలనొప్పి డి విటమిన్ లోపం వలన వస్తాయంట.

తరచూ జలుబు, దగ్గు వంటి సమస్యలు గనుక వస్తున్నట్లైతే వారిలో డి విటమిన్ లోపం ఎక్కువగా ఉందని అర్థం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

కొంత మందికి ఉన్నట్లుండి జుట్టు రాలడం ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా మహిళల్లో అతిగా జుట్టు రాలడం ప్రారంభమైతే వారిలో విటమిన్ డి లోపం ఉన్నట్లు గుర్తించాలంట.