ఎప్పుడూ కడుపు నొప్పిగా ఉంటుందా.. జాగ్రత్త, కడుపు క్యాన్సర్ లక్షణం కావచ్చు!
Samatha
9 july 2025
Credit: Instagram
క్యాన్సర్ అనేది చాపకిందనీరులా వ్యాపిస్తుంది. రోజు రోజుకు క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
తీసుకుంటున్న ఆహారం జీవన శైలి కారణంగా చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా క్యాన్సర్ వ్యాపిస్తుంది.
ఇక ముఖ్యంగా చాలా మంది కడుపు క్యాన్సర్ సమస్యతో బాధగతున్నారు.కడుపులో కణాల నియంత్రణలేకుండా పెరగడం, మధ్యపాన, ధూమపానం క్యాన్సర్‌కు కారణం.
అయితే ఈ లక్షణాలు కొన్ని సార్లు త్వరగా బయటపడితే, మరికొన్ని సార్లు మాత్రం చాలా ఆలస్యంగా వెలుగులోకి వస్తాయి. అయితే కడుపు క్యాన్సర్ లక్షణాలు ఏవో తెలుసుకుందాం.
ఎప్పుడూ కడుపు నొప్పి, అజీర్తీ,గ్యాస్ట్రిక్, గుండెల్లో మంట కడుపు క్యాన్సర్ ముఖ్యమైన లక్షణాలు అని చెబుతున్నారు వైద్యనిపుణులు.
అలాగే ఎప్పుడూ పొత్తికడుపు పైభాగంలో విపరీతమైన నొప్పి, వికారం, వాంతులు, రక్తస్రావం , మలబద్ధకం, నల్లటి మలం, బరువు తగ్గడం
అలసట, పొత్తికడుపు వాపు, ఆకలి లేకపోవడం ఇన్నీ కూడా కడుపు క్యాన్సర్ ప్రధాన లక్షణాలంట. మరీ ముఖ్యంగా కొందరికి ఎక్కువగా కడుపు నొప్పి సమస్య వస్తుంటుంది.
అయితే ఈ సమస్య ఉన్నప్పుడు అస్సలే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలంట. ఎందుకంటే? కొన్నిసార్లు ఇది కడపు క్యాన్సర్‌కు కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు.