పక్షవాతం రావడానికి కొన్ని క్షణాల ముందు ఈ సంకేతాలు కనిపిస్తాయంట!

17 January 2025

samatha 

ఇప్పుడున్న జనరేషన్‌‌లో చాలా మంది అనారోగ్య సమస్యలతో సతమతం అయ్యే వారే ఉన్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు  చిన్న వయసులో కూడా అనేక వ్యాధులు ఎటాక్ చేస్తున్నాయి.

అయితే దీనికి మనం తీసుకునే ఆహారం, జీవనశైలి కూడా ఒక కారణం కావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే కొందరిలో ఉన్నట్లుండి పక్షవాతం వస్తుంది.

ఇలా అది ఎందుకు వస్తుంది. పక్షవాతం వచ్చే కొన్ని క్షణాల ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి. అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్స్ లోపం, సమయానికి సరైన ఆహారం తీసుకోకపోవడం వలన రక్తప్రసరణ సరిగా జరగదు. దీని వలన పక్షవాతం వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందంట.

అంతేకాకుండా, మెదడుకు మన శరీరంలోని ఏదైనా భాగం నుంచి రక్త ప్రసరణ సరిగా జరగకపోతే..అప్పుడు పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

అయితే ఈ పక్షవాతం వచ్చే కొన్ని క్షణాల ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయంట. దీనిని గుర్తిస్తే సమస్య తీవ్రతరం అయ్యే అవకాశం ఉండదంట. 

పక్షవాతం రావడానికి ముందు శరీరంలో బలహీనత ఏర్పడటమే కాకుండా, ఒకవైపే బలహీనంగా అనిపిస్తుంది. చేయి, కాలు బలహీనంగా మారడం జరుగుతుంది.

మూతి ఒక వైపుకు వంకరపోయినట్లుగా అనిపించడం, మాట్లాడటం రాకపోవడం. నిలబడటం, నడవడంలో తడపాటు, కంటి చూపు మందగించడం బట్టి పక్షవాతాన్ని గుర్తించవచ్చు.