టీని ఇలా తాగుతున్నారా?.. అయితే డేంజర్‌లో పడ్డట్లే! 

samatha.j

25 January 2025

Credit: Instagram

ఉదయం అయ్యిందంటే చాలు చాలా మంది టీ తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా తల నొప్పి నుంచి బయటపడటానికి టీని ఎక్కువగా తాగుతారు.

 ఇక కొందరు టీతోనే  రోజును మొదలు పెడితే, మరికొందరికీ మాత్రం అసలు టీ లేనిదే రోజు గడవదూ అని చెప్తుంటారు. అంటే టీ పై మక్కువ అంత ఎక్కువ అన్నమాట

టీతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ దానితో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువే ఉంది అంటున్నారు వైద్యులు.

అయితే చాలా మంది టీనీ మళ్లీ మళ్లీ వేడి చేసి తాగుతూ ఉంటారు. కానీ ఇలా అస్సలే తాగకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

 ఉదయం టీ పెట్టి, మధ్యాహ్నం లేదా, ఈవినింగ్ అదే టీని వేడి చేసి తాగడం వలన దాని రుచి పోవడమే కాకుండా అనారోగ్య సమస్యలు వస్తాయంట.

మళ్లీ మళ్లీ టీని వేడి చేయడం వలన సూక్ష్మజీవుల పెరుగుదల ప్రారంభమవుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. 

టీని పదే పదే వేడి చేయడం వల్ల దాని పోషకాలు పూర్తిగా నాశనం అవుతాయంట.  అలాంటి టీ తాగడం వల్ల కడుపు సమస్యలు వస్తాయంటున్నారు వైద్యులు.

 టీని వేడి చేసి తాగడం వలన, కడుపు నొప్పి, వాంతులు, వికారం  వంటి అనేక సమస్యలు వస్తాయంట. కానీ టీ తయారు చేసిన 15 నిమిషాల తర్వాత వేడి చేస్తే, అది శరీరానికి పెద్దగా హాని కలిగించదు.