ప్రతి సినిమా చివరి సినిమాగానే భావిస్తా .. సమంత షాకింగ్ కామెంట్స్!
samatha.j
24 January 2025
Credit: Instagram
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే స్టార్ హోదా అందుకుంది.
ఇక కొన్ని రోజుల నుంచి ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీ షాకింగ్ కామెంట్స్ చేసింది
ఆమె మాట్లాడుతూ.. సాధారణ నేను ఎన్నో సినిమాలు అంగీకరించొచ్చు. కానీ, నా జీవితంలో ప్రతి దానిని చివరిదిగా భావించే దశలో నేను ఉన్నాను.
కచ్చితంగా నేను ప్రేక్షకుల మనసు దోచుకొనే పాత్రలనే ఎంపిక చేసుకుంటాను. నాకు బాగుంది, అభిమానులకు నచ్చుతుంది అనే పాత్రలను ఎంచుకుంటాను అని తెలిపింది
రాజ్ అండ్ డీకేతో కలిసి వర్క్ చేయడానికి కారణాన్ని వివరిస్తూ,వాళ్లు ఎక్కువగా సవాలుగా అనిపించే పాత్రలనే రూపొందిస్తున్నారు. వారితో కలిసి వర్క్ చేయడం నాకెంతో సంతృప్తిగా ఉంటుంది.
నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలు ఎక్కువగా రూపొందిస్తున్నారు. గొప్ప సినిమాలో నటించాననే భావన రాకపోతే వర్క్ చేయలేను అని సమంత చెప్పింది
సామ్ రీసెంట్‌గా రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన సిటడెల్ హనీ బన్నీ'లో నటించారు. ఈ సిరీస్ సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుకు ఉత్తమ విదేశీ భాష విభాగంలో నామినేట్ అయ్యింది.
ప్రస్తుతం సామ్ 'మా ఇంటి బంగారం' అనే సినిమాను ప్రకటించారు. ఇటీవలే ఆమె ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించిన విషయం తెలిసిందే.