మూడు పూటలా కడుపు నిండా అన్నం తింటున్నారా?

samatha.j

27 January 2025

Credit: Instagram

కొంత మంది ఉదయాన్నే టిఫిన్ చేసి, మధ్యాహ్నం లంచ్‌లో భాగంగా రైస్ తింటారు. నైట్ డిన్నర్‌లో రైస్ వీలైతే చపాతీ తింటుంటారు.

 కానీ కొందరు  అన్నం తప్పితే వేరే ఏ ఫుడ్ తినడానికి ఇష్టపడు. వీరు రోజుకు మూడు సార్లు కడుపు నిండా అన్నం తింటారు.

అయితే ఇలా రోజుకు మూడు సార్లు అన్నం తినడం ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అన్నంలో కార్యోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది. అయితే మూడుపూటలా అధిక కార్బోహైడ్రేట్‌ తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకపోయి ఊబకాయం బారిన పడే అవకాశం ఉందంట.

అన్నంలో కార్యోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది. అయితే మూడుపూటలా అధిక కార్బోహైడ్రేట్‌ తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకపోయి ఊబకాయం బారిన పడే అవకాశం ఉందంట.

 రోజుకు మూడు సార్లు అతిగా అన్నం తినడం వలన మధుమేహా వ్యాధి బారిన పడాల్సి వస్తుందంట. అందుకే అన్నం చాలా తక్కువగా తినడం మంచిది.

అంతేకాకుండా ఇలా ప్రతి రోజూ అన్నమే తినడం వలన శరీరానికి సరైన విటమిన్స్ అందవు, దీంతో శారీరక సమస్యలు వస్తాయి.

అధిక కార్బోహైడ్రేట్‌ వల్ల ఫ్యాటీ లివర్‌ ప్రమాదం పెరుగుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందంట.