వర్కింగ్ అవర్ కంటే ఎక్కువ సమయం డ్యూటీ చేస్తున్నారా?

samatha.j

26 January 2025

Credit: Instagram

 ప్రస్తుతం చాలా మంది ఒత్తిడికి లోను అవుతున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. అయితే ఇలా స్ట్రెస్‌కు గురి కావడానికి ముఖ్య కారణం వర్క్ ప్రెషర్ అంట.

 కొంత మంది పని చేసే ఆఫీస్ లో తనను గుర్తించాలని, ఇంక్రిమెంట్ కోసం ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు. వర్క్ టైమ్ కంటే ఎక్కువ సమయం డ్యూటీ చేస్తుంటారు.

 ఇంకొంతమంది ఆఫీస్ లో ఉండే టార్గెట్స్ వలన సమయానికి వర్క్ కంప్లీట్ అవ్వకపోవడంతో ఎక్కువ సమయం వెచ్చించి డ్యూటీ చేయవలసి వస్తుంది.

అయితే ఇలా  వర్కింగ్ అవర్ కంటే, ఎక్కువ సమయం వర్క్ చేయడం వలన అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

 కాగా అసలు ఎక్కువ పని గంటలు వర్క్ చేయడం వలన ఎలాంటి సమస్యలు వస్తుంటాయో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

తాజాగా చేసిన ఓ సర్వే ప్రకారం, 2016 లో, 7,45,000 మంది ఎక్కువ పనిగంటలు వర్క్ చేయడం వలన  స్ట్రోక్, ఇస్కీమిక్ గుండె జబ్బులతో మరణించారు. 

వర్కింగ్ అవర్ కంటే ఎక్కువ పని చేయడం మన జీవిత కాలాన్ని తగ్గిస్తుందని అంటున్నారు నిపుణులు, అందువలన వర్క్ విషయంలో చాలా జాగ్రత్తగా, మన హెల్త్ పై ప్రభావం పడకుండా చూసుకోవాలి.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్  పరిశోధన ప్రకారం, వారానికి 48 గంటల కంటే ఎక్కువ సేపు స్థిరంగా పనిచేయడం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం తో  మరణించే ప్రమాదం ఉందంట.