సమ్మర్ : ఫ్రిజ్‌లో నీరు వద్దూ..మట్టికుండ నీరుతోనే బోలేడు ప్రయోజనాలు!
samatha
28 February 2025
Credit: Instagram
సమ్మర్ వచ్చిందంటే చాలు ఎండలు మండిపోతుంటాయి. దీంతో చాలా మంది ఫ్రిజ్‌లోని నీరు తాగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు.
ముఖ్యంగా ఏదైనా పని మీద బయటకు వెళ్లి వచ్చిందంటే? ఆ వేడిని తట్టుకోలేక వెంటనే ఫ్రిజ్‌లో వాటర్ తాగడం లేదా కూల్ డ్రింక్స్ తాగడం చేస్తుంటారు.
అయితే ఫ్రిజ్‌లో నీరు కాదు సమ్మర్‌లో మట్టి కుండలోని నీరు తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
మట్టికుండలోని నీరు సహజంగానే చల్లగా ఉండటమే కాకుండా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తాగడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
వేసవిలో గ్యాస్, అసిడిటీ లాంటి సమస్యలతో బాధపడే వారు ఈ మట్టికుండలోని నీరు తాగడం వలన వాటి నుంచి విముక్తి పొందవచ్చునంట.
అలాగే శ్వాస కోశ సమస్య, డీ హైడ్రేషన్ బారిన పడేవారు తప్పకుండా ఎండాకాలంలో మట్టికుండలోని నీరే తాగాలంట. దీని వలన డీ హైడ్రేషన్ వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు.
మరీ ముఖ్యంగా వడదెబ్బ బారిన పడిన వారికి మట్టికుండలోని నీరు మంచి ఔషధంగా పనిచేస్తాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అందువలన సమ్మర్‌లో ఫ్రిజ్‌లో నీరు తాగే టప్పుడు చల్లగా అనిపించినా తర్వాత అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి, కాబట్టి మట్టికుండలోని నీరే తాగాలని సూచిస్తున్నారు.