మందు తాగుతూ ఈ ఫుడ్ తింటున్నారా..మీ పని అయిపోయినట్లే!
samatha
21 January 2025
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా చాలా మంది మందు తాగడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.
ఇక మద్యం సేవిస్తున్న క్రమంలో చాలా మంది మంచింగ్‌గా స్నాక్స్, లేదా వేరే ఏవైనా ఆహార పదార్థాలు తింటూ ఉంటారు.
అయితే మందు తాగుతున్న క్రమంలో ఆల్కహాల్‌తో పాటు ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వెళ్లడం ఖాయం అంటున్నారు వైద్య నిపుణులు.
కాగా, డ్రింక్ చేసే సమయంలో మద్యంతో పాటు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు? వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
వైన్, బీర్ తాగేసమయంలో మంచింగ్‌గా అస్సలే బ్రెడ్ తీసుకోకూడదు. ఎందుకంటే ఈ రెండు వస్తువులలో ఈస్ట్ ఉంటుంది. మీ కడుపులో ఇంత ఎక్కువ మొత్తంలో ఈస్ట్ జీర్ణం కాదు. దీంతో జీర్ణ సమస్యలు వస్తాయంట.
ఆల్కహాల్ తీసుకునే సమయంలో మంచింగ్‌గా కొందరు చాక్లెట్స్ తింటుంటారు. అయితే అస్సలే ఇలా తీసుకోకూడదంట. దీని వలన గ్యాస్ట్రో లాంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు
వీటితో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా, చీజీ నాచోలును కూడా మద్యం తాగుతూ తిన కూడదంట. దీని వలన జీర్ణ సబంధ వ్యాధులు రావడమే కాకుండా, గుండెల్లో మంట, యాసిడ్ రిప్లక్స్‌కు కారణం అవుతుందంట.
అలాగే కొంత మందికి డిన్నర్ టైమ్‌లో మద్యం సేవించే అలవాటు ఉంటుంది. అయితే అలాంటి వారు భోజనం చేసే సమయంలో బీన్స్, కాయధాన్యాలు లేకుండా చూసుకోవాలంట. ఈ కాంబినేషన్ వలన స్టమక్ పెయిన్ వంటి సమస్యలు వస్తాయంట.