ఉదయాన్నే గుమ్మడి కాయ గింజలు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!
samatha
7 march 2025
Credit: Instagram
గుమ్మడికాయ గింజలలో అనేక పోషకాలు ఉంటాయి. అందువలన వీటితో మీరు మీ రోజును ప్రారంభించడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
వీటిని ఉదయాన్నే తీసుకోవడం వలన జీర్ణక్రియ సాఫీగా సాగుతోంది. అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది, హృదయ సంబంధం వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
మెదడు పనితీరు మెరుగుపడటమే కాకుండా మిమ్మల్లి ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచుతాయి. అందువల్లనే ప్రతి రోజూ ఉదయం గుమ్మడి గింజలు తీసుకోవాలి అంటున్నారు నిపుణులు.
అలాగే, వీటిలో ప్రోటిన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, జింక్, ఇనుము వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. అందువల్ల ఇవి రోజు మొత్తం మిమ్మల్ని చురుకుగా ఉంచేలా చేస్తాయి.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, జింక్ సమృద్ధిగా ఉండటం వలన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, శరీరంలో ఇన్ఫెక్షన్స్, వాపులను తగ్గించడమే కాకుండా, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగేలా చేస్తాయి.
అందే విధంగా గుమ్మడి గింజలను ప్రతి రోజూ ఉదయం తీసుకోవడం వలన మీ బరువు నియంత్రణకు ఇవి ఉపయోగపడుతాయి. వీటిని ఉదయం తీసుకోవడం వలన కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది, ఈజీగా బరువు తగ్గుతారు.
గుమ్మడి గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్య కరమైన కొవ్వులు, అలాగే ఖనిజాలు మీ మెదడు పనితీరును మెరుగు పరచడమే కాకుండా, జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
మెగ్నీషియం అధికంగా ఉండే ఈ గుమ్మడి గింజలను ప్రతి రోజూ తీసుకోవడం వలన రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అలాగే ఇవి డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.