ఓరి దేవుడో.. వర్షాకాలంలో చేపలు తినకూడదా? తింటే ఆసుపత్రికేనంట!

samatha 

28 JUN  2025

Credit: Instagram

చేపలు తినడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా చేపలతో అనేక రకాల వంటలు చేసుకొని తిటుంటారు.

ఇక ఆదివారం వచ్చిందంటే చాలు చాలా మంది ఫిష్ కర్రీ తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. కానీ వర్షకాలంలో అస్సలే చేపలు తినకూడదంట.

వర్షకాలంలో చేపలు తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు దరిచేరే అవకాశం ఉంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవిఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

వర్షాకాలంలో చాలా సరస్సుల్లో చేపలు పడుతుంటారు. అంతే కాకుండా చాలా మంది వర్షాకాలంలో చేపలను తిటుంటారు.

అయితే వర్షాకాలంలో చేపలు చాలా కలుషితమై ఉంటాయంట. చేరువులు, నదుల్లోకి కలుషితమైన నీరు చేరుతుంది. అంతే కాకుండా వ్యర్థాలు ఎక్కువగా నీటిలో కలిసిపోతాయి.

దీని వలన నీటి నాణ్యతతో పాటు, చేపల నాణ్యత కూడా తగ్గిపోతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అందువలన ఈ సీజన్‌లో చేపలు ఎక్కువ తినకూడదంట.

దీని వలన జీర్ణసంబంధమైన సమస్యలు వస్తాయంట. అలాగే, కడుపు నొప్పి, జ్వరం, దగ్గు , జలుబు వంటి అనేక సమస్యలు ఎదురవుతాయంట.

అలాగే కొన్ని సార్లు అలెర్జీ వంటి చర్మ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉన్నదంట. అందువలన వీలైనంత వరకు వర్షాకాలంలో చేపలు ఎక్కువ తినకూడదంట.