వామ్మో..కాలిఫ్ల‌వ‌ర్‌తో ఇన్ని లాభాలు ఉంటాయా? అవేంటో తెలిస్తే షాకవుతారు

26 June, 2025

Subhash

విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. విట‌మిన్ సి కి దీన్ని మంచి మూలంగా చెబుతుంటారు. ఒక క‌ప్పు ముక్క‌ల‌ను ఉడ‌క‌బెట్టి తింటే రోజుకు కావ‌ల్సిన విట‌మిన్ సి ల‌భిస్తుంది. 

చర్మ ఆరోగ్యానికి..

 రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంతోపాటు కొల్లాజెన్ ఉత్ప‌త్తికి దోహ‌దం చేస్తుంది. చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. య‌వ్వ‌నంగా మారుతారు. కాంతివంతంగా క‌నిపిస్తారు. 

రోగ నిరోధ‌క శ‌క్తి

విట‌మిన్ సి ఆక్సిడెంట్ మాదిరిగా ప‌నిచేస్తుంది. విట‌మిన్ కె ఎముక‌లు, దంతాల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. గాయాలు అయిన‌ప్పుడు ర‌క్తం త్వ‌ర‌గా గ‌డ్డ క‌ట్టేలా చేస్తుంది. 

విట‌మిన్ సి శ‌

కాలిఫ్ల‌వ‌ర్‌లో ఫోలేట్ కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. ఇది క‌ణాల నిర్మాణానికి దోహ‌దం చేస్తుంది. క‌నుక గ‌ర్భిణీలు కాలిఫ్ల‌వ‌ర్‌ను తింటుంటే శిశువు ఎదుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది. 

గ‌ర్భిణీల‌కు..

పిల్ల‌ల‌కు పుట్టుకతో లోపాలు రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. విట‌మిన్లు బి1, బి3, బి6 కూడా అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో జీవ‌క్రియ‌లు స‌క్ర‌మంగా, శ‌క్తికి, వ్యాధుల‌ను న‌యం చేయ‌డానికి ప‌నిచేస్తాయి. 

లోపాలు 

కాలిఫ్ల‌వ‌ర్‌లో పొటాషియం స‌మృద్ధిగా ఉంటుంది. ఇది ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. బీపీని త‌గ్గిస్తుంది. శ‌రీరంలో ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉండేలా చేస్తుంది. 

పొటాషియం

అధికంగా ఉండే మాంగ‌నీస్ మెట‌బాలిజం ప్ర‌క్రియ స‌రిగ్గా ఉండేలా చేస్తుంది. అలాగే మెగ్నిషియం, ఫాస్ఫ‌ర‌స్‌, ఐర‌న్ వంటి మిన‌ర‌ల్స్ కూడా కాలిఫ్ల‌వ‌ర్‌లో అధికంగా ఉంటాయి.

మాంగ‌నీస్

కాలిఫ్ల‌వ‌ర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కెరోటినాయిడ్స్‌, ఫ్లేవ‌నాయిడ్స్ అధికంగా ఉండ‌డం వ‌ల్ల కాలిఫ్ల‌వ‌ర్‌ను తింటే శ‌రీరానికి న‌ష్టం చేసే ఫ్రీ ర్యాడిక‌ల్స్ నిర్మూలిస్తుంది.

క్యాన్స‌ర్ రాదు..

గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. గుండె ఆరోగ్యంగా, అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఉపయోగం.

గుండె జ‌బ్బులు