మార్నింగ్ అయ్యిందంటే చాలు టిఫిన్ తిని, ఒక కప్పు టీ తాగనిదే కొందరికీ ఏ పని చేయాలనిపించదని చెబుతుంటారు.
ఇక చాలా మంది మార్నింగ్ టిఫిన్ గా ఎక్కువగా ఇడ్లీ, దోశను తింటుంటారు. మరీ ముఖ్యంగా చాలా మంది ఇడ్లీ ఎక్కువ తింటుంటారు.
అలాగే, ఇళ్లల్లో చాలా త్వరగా అయిపోయే టిఫిన్స్ లో ఇడ్లీనే ముందుంటుంది. అందువలన అమ్మవాళ్లు కూడా ఎక్కువ ఇడ్లీ చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు.
ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కాదు, అలాగే తిన్నాక కడుపు నిండుగా ఉంటుందనే భావనతో ఇడ్లీని చేసి తమ పిల్లలకు వడ్డిస్తుంటారు.
కానీ, ఇడ్లీ ఆరోగ్యానికి అస్సలు మంచివి కాదని నిపుణులు తెలుపుతున్నారు. ఇడ్లీ తినడం వలన పలు సమస్యలు కూడా ఎదురువుతాయంట.
ఇడ్లీలను ఆవిరి మీద ఉడికించి తయారు చేస్తారు. దీంతో ఎలాంటి సమస్య ఉండదు. ముఖ్యంగా, కొవ్వు పదార్థాలు కూడా ఉండవు. మరి,ఈ ఇడ్లీలతో ఏంటి ప్రాబ్లం అనుకుంటున్నారా?
అసలు సమస్య ఇక్కడి నుంచే మొదలైందంటున్నారు నిపుణులు.ఇడ్లీ పిండిని మినపప్పు, బియ్యం రవ్వతో తయారు చేస్తారు. దీనిలో కార్బో హైడ్రేట్స్ ఎక్కువ మోతాదులో ఉండటాయి
అందువలన వలన ఇడ్లీ తిన్న వెంటనే మనకు శక్తిని ఇస్తాయి కానీ, కార్బో హైడ్రేట్స్ కారణంగా త్వరగా అరిగిపోయి వెంటనే మళ్లీ ఆకలి మొదలౌతుందంట. నీరసంగా అనిపిస్తుందంట.