ప్రతి ఇంటి వంగ గదిలో తేనె, అల్లం తప్పక ఉంటాయి. ఈ రెండు పదార్థాలు ఆహారానికి రుచిని మాత్రమే కాదు పలు ఆరోగ్య సమస్యలకు సంజీవనిలా పని చేస్తుంది
TV9 Telugu
అయితే వాటిని సరిగ్గా ఎలా ఉపయోగించాలో తెలిస్తేనే వాటి ప్రయోజనకరమైన లక్షణాలు పొందడానికి వీలుంటుంది. తేనె, అల్లం ఈ రెండు పదార్థాలలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
ఇవి జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. తేనెలో ఉండే ఎంజైమ్‌లు జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి
TV9 Telugu
తేనెలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేయడంలో సహాయపడతాయి. జలుబు, దగ్గుకు అల్లం- తేనె మిశ్రమం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది
TV9 Telugu
అల్లం శోథ నిరోధక లక్షణాలు గొంతులో వాపును తగ్గిస్తాయి. తేనె కూడా దగ్గు నుంచి ఉపశమనం అందిస్తుంది. తేనె, అల్లం ఈ రెండింటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
అల్లం, తేనెలోని ఔషధ గుణాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. అల్లం రక్తం గడ్డకట్టడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది
TV9 Telugu
అల్లం తురుము లేదా ముక్కలుగా కోసి మెత్తగా రుబ్బి దాని రసాన్ని తీసి తేనెతో కలిపి టీ తయారు చేసుకోవచ్చు. ఇది జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. గొంతు నొప్పి, దగ్గును తగ్గించడంలోనూ సహాయపడుతుంది