ఈ ఆహారాలతో హ్యాంగోవర్‎ చిటికెలో దూరం.. 

29 July 2025

Prudvi Battula 

అరటిపండ్లు పొటాషియం అధికంగా ఉంటాయి, ఇది ఆల్కహాల్ కారణంగా కోల్పోయిన ఎలక్ట్రోలైట్‌లను భర్తీ చేయడంలో సహాయపడుతుంది.

అరటిపండ్లు

పెరుగు శరీరానికి ప్రోబయోటిక్స్ అందిస్తుంది. వికారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో హ్యాంగోవర్ దూరం అవుతుంది.

పెరుగు

బ్రెడ్, టోస్ట్ సులభంగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్‌లను అందిస్తాయి. ఇవి హ్యాంగోవర్ సమయంలో వికారాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

బ్రెడ్, టోస్ట్

కొబ్బరి నీళ్లు శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి. అలాగే ఎలక్ట్రోలైట్‌లను అందిస్తాయి. దీని కారణమా హ్యాంగోవర్ నుంచి ఉపశమనం లభిస్తుంది.

కొబ్బరి నీళ్లు

ఎలక్ట్రోలైట్ పానీయాలు శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి. అలాగే మద్యం కారణంగా కోల్పోయిన ఎలక్ట్రోలైట్‌లను భర్తీ చేస్తాయి. దీంతో  హ్యాంగోవర్ తగ్గుతుంది.

ఎలక్ట్రోలైట్ పానీయాలు

గుడ్లు శరీరానికి ప్రోటీన్, ఇతర పోషకాలను అందిస్తాయి. ఇవి మద్యపానం వల్ల వచ్చిన హ్యాంగోవర్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

గుడ్లు

క్రాకర్లు, శాండ్‌విచ్‌లు సులభంగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్‌లను అందిస్తాయి. ఇవి హ్యాంగోవర్‌ను దూరం చేస్తాయి.

క్రాకర్లు, శాండ్‌విచ్‌లు

ఖర్జూరాలు సహజమైన చక్కెర, ఎలక్ట్రోలైట్‌లను అందిస్తాయి. వీటిని కారణం ఆల్కహాల్ కారణంగా వచ్చిన హ్యాంగోవర్‌ నుంచి ఉపాసనం కలిగిస్తుంది.

ఖర్జూరాలు