మీ పిల్లలకు ఈ డ్రింక్స్ తాగిస్తున్నారా? తెలుసుకోండి!

samatha 

30 January 2025

Credit: Instagram

పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వారికి ఏ సమయంలో ఏ ఫుడ్ పెట్టాలా అని తెగ ఆలోచిస్తుంటారు.

 కానీ కొన్ని సార్లు తెలియక వారికి అనారోగ్యకరమైన ఫుడ్ కూడా పెడుతుంటారు. ముఖ్యంగా ఏదైనా పార్టీలకు వెళ్లినప్పుడు  డ్రింక్స్ తాగిస్తుంటారు.

అయితే చిన్నపిల్లలకు కొన్నిరకాల డ్రింక్స్ అస్సలే తాగించకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏవో చూద్దాం.

పిల్లలకు చక్కెర ఎక్కువ ఉండే డ్రింక్స్ తాగించకూడదంట. ముఖ్యంగా రుచి గల సోడా వంటివి తాగించడం వలన గుండె జబ్బులు, ఊబకాయం వచ్చే ఛాన్స్ ఉంటుందంట.

అలాగే కొందరు తమ పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ తాగిస్తారు. కానీ ఇవి కూడా చిన్న పిల్లలకు అస్సలే తాగించకూడదంట.

కొందరు తమ పిల్లలకు చిన్న వయసులోనే టీ, కాఫీలను అలవాటు చేస్తుంటారు. కానీ ఇవి చాలా ప్రమాదకరం, దీంతో పిల్లలో నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయంట.

అదే విధంగా  చిన్న పిల్లలకు చక్కెర, సోడియం, కెఫిన్ ఎక్కువగా ఉన్న స్పోర్ట్స్ డ్రింక్స్‌ను కూడా తాగించకూడదంట.

 దీని వలన పిల్లలు బరువు పెరగడం, గుండె సమస్యలు, దంతాలు పుచ్చిపోవడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు వైద్యులు.