చలికాలంలో స్మోకింగ్ చేస్తే గుండెపోటు..షాకింగ్ విషయాలు బయటపెట్టిన నిపుణులు!

17 January 2025

samatha 

 స్మోకింగ్ చేయడం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. అయినా చాలా మంది ధూమపానం చేయకుండా ఉండటం లేదు.

మరీ ముఖ్యంగా చలికాలం వస్తే చాలు,  ఎక్కువ సార్లు స్మోకింగ్ చేస్తుంటారు. కానీ ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరం అంట.

చలికాలంలో  గుండె జబ్బులు. శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. ఎందుకంటే ఈ సీజన్‌లో ఉష్ణోగ్రతలు తగ్గడంతో అవి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి.

తగ్గిన ఉష్ణోగ్రతలు నేరుగా మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి మీరు మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.

అందువలన చలికాలంలో స్మోకింగ్ చేయడం చాలా వరకు తగ్గించాలంట. లేకపోతే గుండెపోటు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

స్మోకింగ్ చేయడం వలన రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇది  మీ ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తుంది. సమస్యలను కొనితెస్తుంది.

అలాగే స్మోకింగ్ చేయడం వలన ఆ పొగలో ఉండే రసాయనాలు అనేవి రక్తనాళాలను దెబ్బతీస్తాయి. దీని వల్ల ప్లేట్లెట్స్ పేరుకపోయి రక్తం గట్టకట్టడానికి కారణం అవుతుంది. 

 దీంతో గుండె పోటు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందువలన చలికాలంలో ఎక్కువగా స్మోకింగ్ చేయకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు.