సంతానం కలగాలంటే స్పెర్మ్ కౌంట్ ఎంత ఉండాలో తెలుసా.?
10 August 2025
Prudvi Battula
పురుషుల సంతానోత్పత్తికి స్పెర్మ్ కౌంట్ ఒక ముఖ్యమైన అంశం. తక్కువ స్పెర్మ్ కౌంట్ సంతానోత్పత్తి సమస్యగా మారుతుంది.
మిల్లీలీటర్‌కు 15 మిలియన్ల కంటే తక్కువ స్పెర్మ్ కౌంట్ ఉండటం వల్ల సంతానోత్పత్తి సమస్యలు వస్తాయని అంటున్నారు నిపుణులు.
మిల్లీలీటర్‌కు 15 మిలియన్ల కంటే తక్కువ వీర్యకణాల సంఖ్యను ఒలిగోస్పెర్మియా అంటారని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఒక ఆరోగ్యకరమైన పురుషుడి వీర్యకణాల సంఖ్య మిల్లీలీటర్‌కు 15 మిలియన్ల నుండి 200 మిలియన్ల వరకు ఉండవచ్చు.
స్పెర్మ్ కౌంట్ పెరగడానికి, పురుషులు సాధారణంగా విటమిన్లు సి, డి, జింక్, ఫోలిక్ యాసిడ్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.
స్పెర్మ్ కౌంట్ పెంచడానికి, పండ్లు, కూరగాయలు, గింజలు, తృణధాన్యాలు ఎక్కువ మొత్తంలో తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఒత్తిడి వీర్యకణాల సంఖ్యను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ధ్యానం, విశ్రాంతి వంటివి ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే తగినంత నిద్ర ముఖ్యం. అంటే రోజుకి 8 గండాలు కచ్చితంగా నిద్రపోవాల్సిందే అంటున్నారు వైద్యులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
పోద్ది.. అలా చేస్తే మొత్తం పోద్ది.. మారిన ట్యాక్స్ రూల్స్!
వర్షాకాలంలో ఈ ఫుడ్స్ తింటే.. మీ ఆరోగ్యం అస్సలు తగ్గేదేలే..
స్త్రీ శరీరంపై ఆ ప్రదేశాల్లో బల్లి పడితే.. శుభమా.? అరిష్టమా.?