కిడ్నీలు ఫెయిల్ అయితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా?

17 January 2025

samatha 

ఆరోగ్యానికి మించిన సంపద లేదు అంటారు. కానీ ఇప్పుడు మనం తీసుకుంటున్న ఆహారం జీవనశైలి కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.

ముఖ్యంగా చాలా మందిని కిడ్నీ సంబంధిత వ్యాధులు సమస్యల్లోకి నెట్టేస్తున్నాయి.  కిడ్నీ స్టోన్స్, కిడ్నీ ఫెయిల్ అవ్వడం ఇలా చాలా రకాల సమస్యలు వెంటాడుతున్నాయి.

అయితే కిడ్నీ ఫెయిల్ అయితే వెంటనే దాని లక్షణాలు కనిపిస్తుంటాయి. కానీ ఈ మధ్య కాలంలో కిడ్నీ ఫెయిల్ అయినా ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో, చాలా మంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.

కాగా, దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీ వ్యాధి సైలెంట్ డిసీజ్ అంట.

అయితే ఈ లక్షణాల ద్వారా మనం మన కిడ్నీ ఫెయిల్ అయ్యిందని తెలుసుకోవచ్చునంట. అవి ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మూత్రంలో మంట, మూత్రం నురగగా రావడం, స్మెల్ రావడం, అలాగే  చర్మం పొడిపారడం, కండరాల ఒత్తిడి, తీవ్రమైన అలసట.

అంతేకాకుండా కళ్ల కింద వాపు రావడం, పాదాలు, చేతులు , కొన్ని సార్లు మన శరీరం కూడా వాపు రావడం కూడా కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలేనంట.

ఇవే కాకుండా ఆకలి మందగించడం, వికారం, నడుము నొప్పి, వెన్నునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నిద్రలేమి వంటి సమస్యలు కూడా కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలంట.